![]() |
![]() |

బుల్లితెర మీద సీరియల్స్ లో నటించే రవికిరణ్, సుష్మకిరణ్ గురించి తెలియని వారుండరు. వాళ్ళు సీరియల్స్ లోనే కాదు...షోస్, ఈవెంట్స్ లో కూడా కలిసి కనిపిస్తారు. అలాగే చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే గనక వాళ్ళ అబ్బాయి ప్రభంజన్ ని కూడా వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఆ ఫ్యామిలీ మొత్తం రీసెంట్ గా గోవా ట్రిప్ వెళ్లారు. ఇక ప్రభంజన్ నిద్ర పోయేసరికి సుష్మ కిరణ్, రవి కిరణ్ ఇద్దరూ నైట్ షాపింగ్ చేశారు. అక్కడ వాళ్లకు కావాల్సిన బట్టలు, వాళ్ళ అబ్బాయికి కావాల్సిన వస్తువుల్ని బేరాలాడి తీసుకున్నారు. అలాగే అక్కడ నైట్ షాపింగ్ లో అమ్మేవాళ్ళకు అన్ని రకాల భాషలు వచ్చు అన్న విషయాన్నీ కూడా కనిపెట్టారు. ఇక సుష్మ కిరణ్ వాళ్ళు మాట్లాడుకున్నవి కూడా తెలుసుకుని వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడేసరికి సుష్మ షాకైపోయింది.
ఐతే గోవాలో షాపింగ్ అంటే వాళ్ళు అన్ని డబుల్ రేట్స్ వేసేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా లెక్క పెట్టుకుని తీసుకోవాలని వెళ్లాలనుకునే వారికి ఒక టిప్ కూడా ఇచ్చారు. గోవాలో రకరకాల డ్రెస్సులున్నాయి..అవి సుష్మ కు కూడా బాగా నచ్చాయి. కానీ తక్కువ రేట్ చెప్పి ఎక్కువకి పెంచేస్తున్నారు కాబట్టి వాళ్ళు గోవాలో తక్కువ ధరకు బట్టలు దొరికే ప్రాంతానికి వెళ్లారు. అలాగే వాళ్ళు షాపింగ్ మొత్తం పూర్తి చేసుకున్నారు. చివరిగా గోవాలో జీడిపప్పు ఫేమస్ కాబట్టి ఆ జీడిపప్పును అలాగే స్వీట్స్ ని కూడా తెచ్చుకున్నారు. ఐతే గోవాలో మందు బాబులు పెన్నీ డ్రింక్ అని అంటూ ఉంటారట.. ఐతే ఆ పెన్నీ డ్రింక్ అంటే ఏమో అనుకునేరు అది గోవా నాటు సారా. అది జీడిపప్పుతో తయారు చేస్తారని చెప్పాడు రవికిరణ్..
"కొత్తబంగారులోకం" సినిమాలో స్వప్న ఫ్రెండ్ సింధూరపువ్వుని అంటూ రాగసుధ పాత్రలో నవ్వులు పూయించింది సుష్మ. ఆ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా మెప్పించిన సుష్మ ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య కూతురిగా నటించింది... ‘గోల’,' హౌస్ ఫుల్' మూవీస్ లో నటించిన సుష్మ ...అభిషేకం, కథలో రాజకుమారి, శివరంజిని, పెళ్లి పుస్తకం సీరియల్స్ లో నటించి బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సీరియల్ నటుడు రవికిరణ్ ని పెళ్లిచేసుకుంది సుష్మ...పెళ్లయ్యాక కొన్ని రోజులు సీరియల్స్ చేయకుండా లైఫ్ లో కొంచెం సెట్ అయ్యాక కార్తీకదీపం సీరియల్ తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ అప్ డేట్స్ ని రీల్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది.
![]() |
![]() |